ఉరుకుంద క్షేత్రం.. భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

ఉరుకుంద క్షేత్రం.. భక్తజన సంద్రం

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

ఆలయప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు

కౌతాళం: శ్రావణ మాసం రెండో సోమవారం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనం కోసం రెండు గంటల పాటు నిరీక్షించాల్సిన వచ్చింది. మూడు కల్యాణ కట్టాలు ఏర్పాటు చేసినా సరిపోలేదు. దీంతో భక్తులు ఇక్కడ నిరీక్షించాల్సి వచ్చింది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చోటు దొరికితే అక్కడే వంటలు చేసి స్వామికి నైవేద్యం సమర్పించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఆలయ పరిసరాలలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా కౌతాళం సీఐ యుగంధర్‌, ముగ్గురు సీఐలు, ఎస్‌ఐలు చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement