రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా విడుదల చేయకపోతే రైతులతో కలసి ఉద్యమిస్తాం. పోతిరెడ్డిపాడు వద్ద పరిస్థితి చూసి వాస్తవాలను తెలుసుకోవడానికి వస్తే పోలీసులు కూడా సహకరించాల్సిందిపోయి అడ్డుకుంటే ఎలా? గోరుకల్లు చూడటానికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సార్బీసీకి 19 టీఎంసీల నీరు రావాల్సిన పరిస్థితి ఉంది. మన హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఎన్ని ఉన్నాయని తెలుసుకునే హక్కు వైఎస్సార్‌సీపీ నాయకులకు లేదా? రాయలసీమ రైతులకు న్యాయం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోంది. హంద్రీనీవా కాలువ వెంట మోటార్లు వేసుకొని పంటలు పండించుకుంటే పోలీసులు వాటిని తీసుకుపోవడం దారుణం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు 85 శాతం పూర్తయితే మోటార్లు కూడా బిగించుకోలేకపోతే ఎలా? శ్రీశైలం డ్యాం నీళ్లు తెలంగాణకు తరలిస్తే చూస్తూ ఊరకోం.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
డీఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాటసాని


