కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటి అవసరం ఉండే స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ సూచించారు. కల్లూరు, కర్నూలు, గూడూరు మండలాల్లోని పెంచికలపాడు, పర్ల, జి.సింగవరం, ఉల్చాల గ్రామాల్లో శనివారం పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పొలాలను ఖాళీగా ఉంచకుండా కొర్ర, పెసర, అలసంద, సజ్జ వంటి పంటలు సాగు చేసుకోవాలన్నారు. బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడేందుకు 19–19–19 లేదంటే పోటాషియం నైట్రేటు ఎరువుతో లీటరు నీటికి 10 గ్రాముల ప్రకారం కలిపి పిచికారీ చేయాలన్నారు. సీనియర్ శాస్త్రవేత్త బాలాజీనాయక్, అసిస్టెంటు ప్రొఫెసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.


