అవుకులో సినిమా షూటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అవుకులో సినిమా షూటింగ్‌

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

కొలిమిగుండ్ల(అవుకు): ఉప్పులపాడు రోడ్డులోని అవుకు రిజర్వాయర్‌ వద్ద శనివారం హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న హైందవ సినిమా షూటింగ్‌ జరిగింది. లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తున్నారు. రిజర్వాయర్‌ బ్రిడ్జితో పాటు పరిసర ప్రాంతాల్లో హీరో, హీరోయిన్‌లపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నారు.

సంగమేశ్వరానికి సందర్శకుల తాకిడి

కొత్తపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరాలయం పూర్తిగా కృష్ణానది జలాలో జలాధివాసం అయ్యింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 876.20 అడుగులకు చేరుకుంది. రెండవ శనివారం సెలవుదినం కావడంతో భక్తులు, సందర్శకులు ఎగువ పుష్కరఘాట్‌ వద్దకు చేరుకుని కృష్ణమ్మ అందాలను తిలకించారు. భక్తులు పుణ్య స్నానాలు చేసి ఎగువన ఉన్న ఉమా మహేశ్వర ఆలయంలో పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement