ఓటర్లకు బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్లకు బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలి

Jul 14 2026 4:29 AM | Updated on Jul 14 2026 4:29 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి

కర్నూలు(సెంట్రల్‌): ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సోమ, మంగళవారాలే సమయం ఉండడంతో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు. సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో మాట్లాడారు. మిగిలిన పోయిన ఓటర్ల వివరాలను పోలింగ్‌ కేంద్రాల్లోనే సమర్పించేలా బీఎల్‌ఏలు చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన(డెత్‌), డూప్లికేట్‌ ఓటర్లకు సంబంధించి తగిన ఆధారాలు/సర్టిఫికెట్లు/ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయోలేదో పరిశీలించుకోవాలన్నారు. అబెసెంట్‌, సిఫ్టెడ్‌ ఓటర్ల వివరాల సేకరణను కూడా నిశితంగా పరిశీలించాలన్నారు. ఏఎస్‌డీడీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలను ఈఆర్‌ఓలు తనిఖీలు చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో జేసీ నూరుల్‌ ఖమర్‌, కర్నూలు ఈఆర్‌ఓ చల్లా ఓబులేసు, ఆదోని, ఎమ్మిగనూరు ఈఆర్‌ఓలు మధుసూదన్‌రెడ్డి, కోడుమూరు ఈఆర్‌ఓ సందీప్‌కుమార్‌, పత్తికొండ ఈఆర్‌ఓ ఓబులేసు, మంత్రాలయం ఈఆర్‌ఓ అనురాధ, ఆలూరు ఈఆర్వో రామసుబ్బయ్య పాల్గొన్నారు.

కర్నూలులో పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

కర్నూలు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి పరిశీలించారు. నగరంలోని సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో, చిదంబరంవీధిలోని వివేకానంద బాల విద్యా మందిర్‌లో పోలింగ్‌ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఏఎస్‌డీడీ జాబితాల తయారీ, అన్‌కలెక్టబుల్‌ ఓట్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని ఈఆర్‌ఓ చల్లా ఓబులేసును ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement