మొండికేసిన బస్సు
బనగానపల్లె: ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. కండీషన్ లేని బస్సులు నడపడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ధర్మవరం నుంచి నంద్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బనగానపల్లె ఆర్టీసీ డిపోకు రెండు కిలోమీటర్ల దూరంలో మొండికేసింది. బస్సు బెల్టు తెగిపోవడంతో ముందుకు కదలని పరిస్థితి. దీంతో అందులో ఉన్న 50 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు డ్రైవర్, కండెక్టర్ వారిని కిందకు దించి వేరే బస్సులో పంపారు. ఉచిత బస్సు హామీ అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు బస్సుల కండీషన్‌పై దృష్టి సారించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.
బయోగ్యాస్ కంపెనీలో గ్యాస్ లీక్
కల్లూరు: ఉలిందకొండ సమీపంలోని రిలయన్స్ బయోగ్యాస్ సోపాన్ కంపెనీలో గ్యాస్ లీకై ంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ముగ్గురు గాయపడ్డారు.ఉలిందకొండ గ్రా మానికి చెందిన సురేంద్ర (25 ), నాయకల్లు గ్రా మానికి చెందిన చంద్రమోహన్ (25), మహేష్ (22 ) గాయపడిన వారిలో ఉన్నారు. వీరిని స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూలు నగరంలో ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఉలిందకొండ పోలీసులు విచారిస్తున్నారు.
మొండికేసిన బస్సు


