రమణీయం.. రాయబారాది మహోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథం(తేరుబండి)పై ముస్తాబు చేశారు. అనంతరం అష్టపుర గ్రామానికి చెందిన ప్రజలు ఎండ్ల బండ్ల ప్రదర్శనతో రాయబారాది కార్యక్రమానికి తరలి వెళ్లారు. గ్రామ సమీపంలోని గంగమ్మ గుడి వద్ద ఉన్న వేపచెట్టు వద్ద అమ్మవారికి రాయబారాది కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసింది.


