బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 2,474 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 2,016 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.
రెవెన్యూ సమస్యలపరిష్కారానికి క్యాంపులు
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. చుక్క ల భూములు, నిషేధిత జాబితా భూములు, అడంగల్ సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది బాధిత రైతుల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. క్యాంపులను డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డీఓలు పర్యవేక్షిస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ప్రజలకు మరింత మెరుగ్గా తపాలా సేవలు
కర్నూలు(అర్బన్): గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజ లకు తపాలా సేవలను మరింత మెరుగ్గా అందించాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి కోరారు. బీమా సంకల్ప్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18, 19, 20వ తేదిల్లో కర్నూలు డివిజన్ పరిధిలో పీఎల్‌ఐ/ఆర్‌ఎల్‌ఐ రూ.1.51 కోట్లను కొత్త ప్రీమియంగా సేకరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక హెడ్ పోస్టాఫీసు ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ ఇన్సూరెన్స్‌పై ఇంకా ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టి కర్నూలు డివిజన్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలన్నా రు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీమా యోధులను ప్రశంసిస్తూ బహుమతులను అందించారు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్ జనరల్ ఉపేందర్, అసిస్టెంట్ డైరెక్టర్లు వెంకటరెడ్డి, నాగా నాయక్, కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
వామ్మో...కొండచిలువ
మహానంది: బుక్కాపురం గ్రామంలో లక్ష్మీనరసమ్మ కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్ వద్ద మంగళవా రం కొండచిలువ కనిపించడంతో హడలిపోయా రు. వెంటనే అయ్యన్ననగర్‌కు చెందిన స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. అతను గ్రామానికి చేరుకుని సుమారు పది అడుగుల పొడవున్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
బీఈడీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల


