మారెమ్మ దేవాలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

మారెమ్మ దేవాలయంలో చోరీ

Dec 24 2025 3:58 AM | Updated on Dec 24 2025 3:58 AM

మారెమ

మారెమ్మ దేవాలయంలో చోరీ

గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామ శివారులో ఉన్న అడివి మారెమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకు పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గంజిహళ్లి, గోనెగండ్ల గ్రామా ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీలో ఉన్న నగదు, అమ్మవారి విగ్రహానికి ఉన్న వెండి కోర మీసాలు అపహరించారు. మంగళవారం ఉదయం భక్తులు పూజలు నిర్వహించడానికి వెళ్లగా చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా గుడికి సమీపంలో ఆ గ్రామాలకు చెందిన కొందరు పేకాట ఆడుతున్నట్లు గ్రామస్తులు తెలి పారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

బాబోయ్‌ చిరుతలు...!

మహానంది: నల్లమల అటవీ ప్రాంతాల్లో సమీపంలోని ఉన్న గాజులపల్లె, బసవాపురం పంట పొలాల్లో చిరుతల సంచారంతో రైతులు భ యాందోళన చెందుతున్నారు. పచ్చర్ల ఫీడర్‌లోని గాజులపల్లె గ్రామానికి చెందిన రైతు రంగస్వామిరెడ్డి పొలం సమీపంలో చిరుత సంచరించినట్లు పాదముద్రలు కనిపించాయి. గత కొద్ది రోజుల క్రితం గోవిందరెడ్డి పొలం దగ్గర చిరుతపులి కనిపించింది. పంట పొలాల సమీపంలో చిరుతలు సంచరిస్తుండటంతో రైతులు, కూలీలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.

నన్నూరు బ్యాంకులో

చోరీకి విఫలయత్నం!

ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు గ్రామంలో ఉన్న ఆంధ్రపగతి గ్రామీణ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏపీజీబీ వెనుకాల ఉన్న ఖాళీ స్థలం నుంచి బ్యాంక్‌ గోడను పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులోపల నిర్మించిన బాత్‌రూంను పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా దానికి తాళం వేసి ఉండటంతో దిక్కుతోచక వెనక్కు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. మంగళవారం బ్యాంకుకు వచ్చిన అధికారులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అనుమానిత వ్యక్తులను తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం.

కేసీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పడమర వనుములపాడు పగిడ్యాల గ్రామాల మధ్య కేసీ కాలువలో మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు ఎర్రటి చీర, నల్లటి జాకెట్‌ ధరించి మరుగుజ్జుగా ఉండి సుమారు 50 ఏళ్లకు లోపే ఉంటుంది. కేసీ కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడం వలన దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు కేసీ కాలువ వెంట గాలించినా కని పించలేదని స్టేషన్‌ ఏఎస్‌ఐ శేషయ్య తెలిపారు.

వైద్యులపై కేసు నమోదు

దొర్నిపాడు: ఆళ్లగడ్డ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో రూ.1.16 కోట్ల నిధుల అవకతవకలు జరిగిన విషయంలో నలుగురు వైద్యాధికారులపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపారు. సబ్‌ ట్రెజరీ అధికారి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాణి, బాబు, నాగమస్తాన్‌, నాగదాసయ్య, పీహెచ్‌సీ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంతియాజ్‌లపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కుంభకోణం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

యువతి అదృశ్యం

నంద్యాల(అర్బన్‌): పట్టణ శివారు ప్రాంతం వైఎస్సార్‌నగర్‌కు చెందిన రెహనా అనే యువతి అదృశ్యమైంది. మంగళవారం ఉదయం బయటకెళ్తున్నానంటూ చెప్పి ఇంటి నుంచి వెళ్లినా రెహానా తిరిగి రాలేదు. గాలించినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో యువతి పెద్దమ్మ పెద్ద రాధ నంద్యాల రూరల్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గోనెగండ్ల: మండల పరిధిలోని పుట్టపాశం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఆర్‌టీసీ బస్సు బైకు (ఎక్స్‌ఎల్‌)ను ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సు (ఏపీ 21 జెడ్‌ 0664) మంగళవారం రాత్రి ఎమ్మిగనూరు నుంచి కర్నూలుకు బయలు దేరింది. పుట్టపాశం గ్రామ సమీపంలో కర్ణాటక రిజిస్ట్రేషన్‌ ఉన్న ద్విచక్ర వాహనం (కేఏ 05 4462 ఎక్సెల్‌)పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుని వద్ద సమాచారం తెలిపే ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.

మారెమ్మ దేవాలయంలో చోరీ 1
1/2

మారెమ్మ దేవాలయంలో చోరీ

మారెమ్మ దేవాలయంలో చోరీ 2
2/2

మారెమ్మ దేవాలయంలో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement