చెక్కుచెదరని వైభవం!
ఊరూరా క్రిస్మస్ సందడి మొదలైంది. క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ వేడుకకు చర్చీలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ స్టార్‌లు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఆకట్టుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు చోట్ల వందల ఏళ్ల చరిత్ర కలిగిన చర్చీలు ఉన్నాయి. బ్రిటీషుల కాలంలో నిర్మించిన ఇవి నేటికీ చెక్కుచెదరకుండా ఠీవీగా దర్శనమిస్తున్నాయి. నిత్య ప్రార్థనలు, బైబిల్ పఠనాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యాయి.
– ఆలూరు రూరల్/చిప్పగిరి/ మద్దికెర


