ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్‌లను వినియోగించుకోండి
కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, వెంచర్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ (లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్), బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్)లను వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కొత్తబస్టాండ్ సమీపంలోని క్రెడాయ్ (కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఏస్టేట్, డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) కార్యాలయంలో కర్నూలు చాప్టర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇందుకు నిర్మాణాదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమంగా నిర్మించిన భవనాలు, అక్రమంగా వెలసిన లేఔట్లను క్రమబద్దీకరించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల రమణ, అధ్యక్షులు సురేష్ రెడ్డి, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు (టౌన్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో కర్నూలుకు చెందిన కరాటే క్రీడాకారులు పతకాలు సాధించడం గర్వ కారణమని జిల్లా ఒలింపిక్ సంఘం సీఈఓ విజయ్‌కుమార్, కార్యనిర్వహక కార్యదర్శి పి.సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం వెంకటరమణ కాలనీలోని గుజ్జరియో కరాటే అకాడమీలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన యువన్ సాయి, అర్షియాకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి రోజు కరాటే సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. మాస్టర్ జగదీష్ కుమార్, జిల్లా కరాటే సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, సీనియర్ కరాటే మాస్టర్ ఆరిఫ్ హుస్సేన్, గౌస్‌బాషా పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్‌లను వినియోగించుకోండి


