మీ పిల్లలను ఇలాగే చూసుకుంటారా?
హాస్టల్ నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం
కోసిగి: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్) నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలనైతే ఇలాగే వదిలేస్తారా.. అని ప్రశ్నించారు. మంగళవారం ఆమె కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్‌లో భోజన వసతి ఏవిధంగా ఉంటుంది, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? అని పిల్లలను ఆరా తీశా రు. అయితే పిల్లలు తమ ఆవేదన వ్యక్తం చేయడంతో వార్డెన్ గోపాల్‌పై మండి పడ్డారు. బీసీ సంక్షేమ శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి వారం రోజుల్లోగా మరమ్మతులు చేయించి ఫొటోలు తీసి పంపాలని ఆదేశా లు జారీ చేశారు. పిల్లలకు ఇచ్చే పాలలో నీటిని అధికంగా కలపడం, చికెన్ కొంచమే పెట్టడం ఏమిటని, అరటి పండు ఎందుకు ఇవ్వడం లేదని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బందిని వెంటనే మార్పు చేయాలన్నారు. నిర్లక్ష్యానికి కారుకుడైన వార్డెన్ గోపాల్‌పై చర్యలకు ఆదేశించారు. పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న వాచ్‌మన్ రామయ్యను టెర్మినేట్ చేయాలన్నారు. పర్యవేక్షణలో విఫలమైన అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ మహబూబ్ బాషా, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారికి
షోకాజ్ నోటీసులు
వార్డెన్, వాచ్‌మన్‌లపై చర్యలకు ఆదేశం


