ప్రజలకు సత్వర సేవలు అందించాలి
మద్దికెర : ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సత్వర సేవలు అందించాలని కర్నూలు జిల్లా సెంట్రల్ ప్రభారి ఆఫీసర్ టి.బంగారు రాజు అన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమం ప్రగతిని సమీక్షించేందుకు మంగళవారం మండలంలో పర్యటించారు. అంగన్‌వాడీ కేంద్రాలను, మద్దికెరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాల, ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ గుండాలనాయక్, ఎంపీ డీఓ కొండయ్య, వైద్యులు రాగిణి, శ్రీలక్ష్మి ఉన్నారు.


