శ్రీమఠంలో సినీనటుడు రిషబ్‌శెట్టి | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో సినీనటుడు రిషబ్‌శెట్టి

Dec 25 2025 8:33 AM | Updated on Dec 25 2025 8:33 AM

శ్రీమ

శ్రీమఠంలో సినీనటుడు రిషబ్‌శెట్టి

ఉద్యాన క్లస్టర్లతో నాణ్యత పెంపొందిస్తాం

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మండల కేంద్రంలో శ్రీమద్వ కారిడార్‌లో శ్రీ మఠం అధికారులు సంప్రదాయం ప్రకారం వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. రిషబ్‌ శెట్టి కుటుంబ సభ్యులను శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆశీర్వదించి, శేషవస్రం, ఫల మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేశారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి

కర్నూలు(హాస్పిటల్‌): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల ప్రోగ్రామ్‌ అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్‌లో మాతృమరణం జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైరిస్క్‌ గర్భిణిల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయుష్మాన్‌ ఆరోగ్యమందిర్‌లో అందించే వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్‌ ఉమా, డీపీఎంయూ డాక్టర్‌ శైలేష్‌కుమార్‌, సంచార చికిత్స కార్యక్రమ జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ రఘు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్‌ మహేశ్వరప్రసాద్‌ పాల్గొన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో 19 ఉద్యాన క్లస్టర్ల ఏర్పాటు చేసి ఎక్స్‌పోర్ట్‌ నాణ్యతతో దిగుబడులు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉద్యాన శాఖ విశ్రాంత జాయింట్‌ డైరెక్టర్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ వై.విద్యాశంకర్‌ తెలిపారు. బుధవారం కర్నూలు ఉద్యానభవన్‌లో క్లస్టర్‌ డెవలప్‌మెంటు కార్యక్రమంపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లి, మిరప, టమాట తదితర ఉద్యాన పంటలను క్లస్టర్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్కో క్లస్టర్‌లో 5వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమని, మూడు దశలో ఈ ప్రక్రియ చేపడతామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 100 శాతం రాయితీ గ్రాంటు రూపంలో లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లా ఉద్యాన అధికారులు రాజాకృష్ణారెడ్డి, నాగరాజు, నాబార్డు ఏజీఎం సుబ్బారెడ్డి, నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు డైరెక్టర్‌ సోమశేఖర్‌, సాంకేతిక ఉద్యాన అధికారి అనూష పాల్గొన్నారు.

అన్నప్రసాద వితరణకు రూ.3లక్షల విరాళాలు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3లక్షల విరాళాలను అందించారు. బుధవారం విశాఖపట్నంకు చెందిన ఎన్‌.రామకృష్ణన్‌ రూ.లక్ష విరాళాన్ని ఏఈవో శ్రీనివాసులరెడ్డికి అందించారు. అలాగే కర్నూలుకు చెందిన ఎ.సుధేష్ణరాణి రూ.లక్ష విరాళాన్ని ఏఈవో సతీష్‌కు, గుంటూరుకు చెందిన చెరుకూరి సాయి వెంకట్‌ రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. అందించిన దాతలకు జ్ఞాపికలను అందించి సత్కరించారు.

శ్రీమఠంలో సినీనటుడు రిషబ్‌శెట్టి 1
1/2

శ్రీమఠంలో సినీనటుడు రిషబ్‌శెట్టి

శ్రీమఠంలో సినీనటుడు రిషబ్‌శెట్టి 2
2/2

శ్రీమఠంలో సినీనటుడు రిషబ్‌శెట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement