శాశ్వత పరిష్కారం చూపాలి
దశాబ్దాల తరబడి గ్రామంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఇప్పుడు 10 నుంచి 15 రోజులకు ఒకసారి బాపురం రిజర్వాయర్ నీరు వస్తున్నాయి. వేసవి కాలంలో నెల రోజులకు ఒకసారి కూడా నీరు వదలని పరిస్థితి ఉంటుంది. దీంతో గ్రామ సమీపంలోని వక్కిరేణి నీరే మాకు దిక్కు. ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు లోనవుతున్నారు. గ్రామంలో నీటి సమస్యకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నీటిని మళ్లించి రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది.
– లక్ష్మన్న, జొహరాపురం, ఆస్పరి మండలం
రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడతాం. ఇప్పటికే ఎస్‌ఎస్ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపుకున్నాం. తిరిగి ఏప్రిల్‌లో ఎల్‌ఎల్‌సీ నుంచి తాగునీటి అవసరాలకు నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ద్వారా టీబీపీ అధికారులను కోరాం. గ్రామీణ ప్రాంతాల్లో నీటి అవసరాలకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో స్టాండ్‌బై పంప్‌సెట్లను కూడా కొనుగోలు చేస్తాం.
– సీహెచ్ మనోహర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ
శాశ్వత పరిష్కారం చూపాలి


