మెరిసే క్రిస్మస్
విద్యుత్ దీపాలతో వెలుగులీనుతున్న కర్నూలులోని కెథడ్రల్ చర్చి
నేడు క్రిస్మస్.. క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పర్వదినం. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అంతటా పండుగ నిర్వహించనున్నారు. చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇళ్ల వద్ద నక్షత్రాలను, క్రిస్మస్ ట్రీలను వెలిగించారు. కరుణామయుడు అయిన క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


