క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
Sakshi News home page

Heart Attack: క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Aug 14 2023 1:42 AM | Updated on Aug 14 2023 9:41 AM

- - Sakshi

కర్నూలు: నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణం సంజీవనగర్‌ కాలనీకి చెందిన యువకుడు నక్క మహేంద్ర (22) తోటి మిత్రులతో కలిసి క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నక్క తిమ్మప్ప, లక్ష్మీదేవి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు మహేంద్ర (22) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం కాలనీకి సమీపాన తోటి మిత్రులతో కలిసి మహేంద్ర క్రికెట్‌ ఆడుతూ గుండెలో నొప్పి వస్తుందంటూ కుప్ప కూలిపోయాడు. దీంతో తోటిమిత్రులు మహేంద్రను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏకై క కుమారుడు గుండెపోటుతో మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement