చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వివరాలను జెడ్పీ సీఈవో మోమిడి శ్రీహరి గురువారం వెల్లడించారు. మచిలీపట్నం నార్త్, సౌత్, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారని, అక్కడే లెక్కింపు జరుగుతుందని తెలిపారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాలకు సంబంధించి అవనిగడ్డలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. ఘంటసాల మండలం ఓట్ల లెక్కింపు ఘంటసాల జెడ్పీ హైస్కూల్‌లో జరుగుతుందన్నారు. గన్నవరం ఓట్ల లెక్కింపు గన్నవరం సెయింట్ జాన్స్ హైస్కూల్లో, గుడివాడ, బాపులపాడు, ఉంగుటూరు, గుడ్లవల్లేరు, పెదపారుపూడి మండలాలకు సంబంధించి గుడివాడ వీకెఆర్, వీఎన్‌డీ కళాశాలలో భద్రపరిచి లెక్కింపు జరుగుతుందన్నారు. పెనమలూరు, కంకిపాడు మండలాలు ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో, ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాలు ఉయ్యూరులోని వీఆర్‌కేఎం పాఠశాలలో లెక్కింపు జరుగుతుందన్నారు. మొవ్వ, పామర్రు, పమిడిముక్కల మండలాలకు సంబంధించి మొవ్వలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సీఈవో తెలిపారు.
ఫోటో ఓన్లీ మగ్‌షాట్


