ఫలితాలు నిక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

ఫలితాలు నిక్షిప్తం

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

uIIలో ఫలితాలు నిక్షిప్తం పులిచింతల సమాచారం చిలకలపూడి(మచిలీపట్నం): చెదురుమదురు ఘటనల మధ్య గురువారం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. మొత్తం 26 జెడ్పీటీసీ, 343 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో 1266 పోలింగ్‌ బూత్‌ల్లో 9,98,055 మంది ఓటర్లకు గాను, 7,30,494 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. 73.50 శాతం పోలింగ్‌ నమోదైంది. జెడ్పీటీసీ స్థానాలకు 74 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ స్థానాలకు 774 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పోలింగ్‌ సరళి ఇలా... జిల్లాలోని 1266 పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ 9 గంటల సమయానికి 15.75 శాతం నమోదైంది. అనంతరం 11 గంటల సమయానికి 32.62 శాతం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 48.77 శాతం, 3 గంటల సమయానికి 63.04 పోలింగ్‌ శాతం నమోదైంది. ఎన్నికల నిర్వహణలో అధికారుల సిత్రాలు ● మచిలీపట్నం సౌత్‌ మండలంలో రుద్రవరం, గొల్లపాలెం బూత్‌లు తారుమారు కావటంతో ఓటర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. రుద్రవరం ఓటర్లకు గొల్లపాలెంలో, గొల్లపాలెం ఓటర్లకు రుద్రవరంలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. అదేమని అధికారులను ప్రశ్నిస్తే బూత్‌ నంబర్లు మారిపోయాయని ఇప్పుడు చేయగలిగినది ఏమీ లేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ సమాచారం ముందుగా తెలియని ఇరుగ్రామాల ఓటర్లు తీవ్ర అవస్థలు పడి కిలోమీటరు దూరం ప్రయాణించి వారికి కేటాయించిన బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకోవలసి వచ్చింది. ● మచిలీపట్నంసౌత్‌ మండలం గుండుపాలెం పోలింగ్‌ బూత్‌లో బ్యాలెట్‌ కౌంటర్‌ ఫైల్‌పై ఉన్న సీరియల్‌ నంబరును ఓటరుకు ఇచ్చే బ్యాలెట్‌పేపరుపై వేసి ఇచ్చారు. దీంతో తాము ఎవరికి ఓటు వేశామో అధికార పార్టీ నాయకులకు తెలిసి తమను తరువాత వేధిస్తారని కొంతమంది ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే కొందరు బయటి నుంచి బ్యాలెట్‌ పేపర్లు తీసుకురాకుండా ఈ చర్య తీసుకున్నామని చెప్పడం గమనార్హం. ● పెనమలూరు మండలం కంకిపాడులో ఆఖరి గంటలో యథేచ్ఛగా రిగ్గింగ్‌ జరిగింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మనుషులు బయటనుంచి 70 మంది కుర్రాళ్లను తీసుకువచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

న్యూస్‌రీల్‌

దుర్గమ్మ సేవలో ఏపీఈఆర్సీ చైర్మన్‌

కృష్ణా వర్సిటీ ఆర్చరీ జట్టు ఎంపిక

శుక్రవారం శ్రీ 6 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
uIIలో
బ్యాలెట్‌ బాక్సుల్లో

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.1520 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతుంది.

మచిలీపట్నం నార్త్‌ మండలం గోపువానిపాలెంలో ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళలు

126 పోలింగ్‌ కేంద్రాల్లో

ఓట్లు వేసిన ఓటర్లు

మచిలీపట్నం సౌత్‌ మండలంలో

పోలింగ్‌ బూత్‌ల మార్పులతో

ఓటర్ల ఇక్కట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ బినోయ్‌కుమార్‌ గురువారం దర్శించుకున్నారు.

డిసెంబర్‌ 15 నుంచి 22వరకు అస్సాంలోని తేజ్‌పూర్‌లో జరిగే ఆలిండియా ఆర్చరీ టోర్నమెంట్‌లో పాల్గొనే కృష్ణా యూనివర్సిటీ క్రీడాకారులను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement