దుర్గమ్మ గోసంరక్షణకు రూ.2 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ గోసంరక్షణకు రూ.2 లక్షల విరాళం

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

దుర్గమ్మ గోసంరక్షణకు రూ.2 లక్షల విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి విశాఖపట్నంకు చెందిన భక్తులు గురువారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. విశాఖపట్నంకు చెందిన సతీష్‌కుమార్‌ నారాయణశెట్టి, అనిత నారాయణశెట్టి రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈవో కిషోర్‌కుమార్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి తోట్లవల్లూరు: పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పీఎల్‌ దయాకర్‌ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు పరిశీలించడంతో పాటు ఫార్మసీలో మందుల లభ్యత, సిబ్బంది పనితీరు గురించి దయాకర్‌ ఆరా తీశారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సాయిప్రసన్న, డాక్టర్‌ మాధవి, సీహెచ్‌ఓ పద్మావతి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ అనిల్‌కుమార్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. దీపావళి రోజు రాత్రి 7 గంటల వరకే దర్శనం ఎన్నికల కేంద్రాన్ని సందర్శించిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ విజయవాడరూరల్‌: విజయవాడ రూరల్‌ మండలం పాతపాడు గ్రామంలోని ఎన్నికల కేంద్రాన్ని రాష్ట్ర చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ గురువారం సందర్శించారు. అక్కడ అధికారులు చేసిన ఏర్పాట్లు, ఎన్నికల సరళిని పరిశీలించారు. అధికారులు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

7వ తేదీన శ్రీమహాలక్ష్మీయాగం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీపావళి పర్వదినాన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, రాత్రి 7 గంటల వరకే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ వైదిక కమిటీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ వద్ద శ్రీధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ సేవ జరుగుతుందన్నారు. సేవ అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తామని పేర్కొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత ఆలయ ప్రాంగణంలో దీపావళి వేడుకలను నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా 7వ తేదీ శనివారం ధన త్రయోదశిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శ్రీమహాలక్ష్మీ యాగం జరుగుతుందని పేర్కొన్నారు. 7వ తేదీ ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాలలో దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు ఈ యాగాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement