కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో గల కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళాపీఠం ప్రాంగణంలో శుక్రవారం కూచిపూడి నాట్యంలోని పలు కోర్సుల ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాట్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు దాఖలు చేసుకున్న విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్, డాక్టర్ ఏలేశ్వరపు శ్రీని వాసులు(అసిస్టెంట్ ప్రొఫెసర్), పసుమర్తి హరినాథశాస్త్రి (టీచింగ్ అసిస్టెంట్) ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్టిఫికెట్ కోర్సుకు 44, డిప్లొమాకు 22, యక్షగానంకు 6, సాత్విక అభినయానికి 8, ఎంపీఏకు 17 మంది దరఖాస్తులు అందినట్లు వైస్ ప్రిన్సిపాల్ వెల్లడించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సంయుక్తంగా జూనియర్ అథ్లెట్లకు అందిస్తున్న ఉపకార వేతనాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని శాప్ కార్యాలయం ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. 15 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న క్రీడాకారులకు ఈ ఉపకార వేతనాలను అందజేస్తారని పేర్కొన్నారు. అథ్లె టిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు అర్హులన్నారు. శిక్షణ, క్రీడా పరికరాలు, మెంటార్షిప్ (మార్గదర్శకత్వం) కోసం ఒక సంవత్సరం పాటు నెలకు రూ.40 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారని, దరఖాస్తులను ఈనెల 16లోగా https://junior.sbifsportsscholarship.org వెబ్సైట్లో సమర్పించాలన్నారు. వివరాలకు 99631 77814లో సంప్రదించాలని కోరారు.


