ఉత్సాహంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

Nov 7 2026 1:54 AM | Updated on Nov 7 2026 1:54 AM

● పురుషుల విభాగంలో విజేతలు.. 60 కేజీల విభాగంలో ఐ. శివరామస్వామి(పీబీ సిద్ధార్థ), 65 కేజీలు ఈ వేణు(పీబీ సిద్ధార్థ), 70 కేజీలు కె.లోకేష్‌(జాకీర్‌ హుస్సేన్‌ కాలేజీ), 75 కేజీలు బి.రవిచంద్ర(జాకీర్‌ హుస్సేన్‌ కాలేజీ), 85 కేజీలు కె.హరికృష్ణ(కేబీఎన్‌ కాలేజీ), 110 కేజీలు జి.సాయి కుమార్‌ రెడ్డి(పీబీ సిద్ధార్థ), 110ప్లస్‌ కేజీలు ఎం.కౌశిక్‌(పీబీ సిద్ధార్థ). ● మహిళల విభాగంలో విజేతలు.. 49 కేజీలు జి.లోహితశ్రీ(ఏఎన్‌ఆర్‌ కాలేజీ), 57 కేజీలు కేబీవీ తన్మయి(ఎస్‌వీడీ లా కాలేజి) 61 కేజీలు బి.లిఖిత(పీబీ సిద్ధార్థ), 69 కేజీలు ఎస్‌కే నజీరా (ఎస్‌వీడీ లా కాలేజీ), 77 కేజీలు బి.ఝాన్సీ (జాకీర్‌ హుస్సేన్‌ కాలేజీ), 86 కేజీలు పి.హిందూ సాహిత్య(శరత్‌ చంద్ర డిగ్రీ కాలేజీ), 86ప్లస్‌ కేజీలు జి.సుభాషిణి(కేటీఆర్‌ ఉమెన్స్‌ కాలేజీ).

విజయవాడరూరల్‌: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్‌ కళాశాలల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు నున్న గ్రామం విజయ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్లో శుక్రవారం ముగిశాయి. పురుషులు, మహిళల విభాగాలలో వివిధ బరువు విభాగాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.ఉదయ్‌ కుమార్‌ మాట్లాడుతూ వెయిట్‌ లిఫ్టింగ్‌ విజేతలకు అభినందనలు తెలిపారు. క్రీడాకారులు భవిష్యత్తులో విశ్వవిద్యాలయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కృష్ణా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు పోటీలను పర్యవేక్షించగా, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ డి.రత్నబాబు సమన్వయ పరిచారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎన్‌.సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement