క్రీడలతో క్రమ శిక్షణ అలవడుతుంది | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో క్రమ శిక్షణ అలవడుతుంది

Aug 17 2026 1:47 AM | Updated on Aug 17 2026 1:47 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శరీర ధారుడ్యానికే కాకుండా క్రమ శిక్షణను అలవర్చుకోవడానికి క్రీడలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వల్లే శ్రీనుబాబు చెప్పారు. స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్‌ టెన్నిస్‌ మహిళల సిటీ లీగ్‌ ఆదివారం జరిగింది. శ్రీనుబాబు హాజరై లీగ్‌ను ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే క్రీడలో ఎదుగుదలకు ఆస్కారం ఉంటుందని, సాఫ్ట్‌ టెన్నిస్‌కు రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సెక్రటరీ పి.మురళి, ఎన్టీఆర్‌ జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.దిలీప్‌ ప్రసన్న బాబు ప్రసంగించారు. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ (ఖేలో ఇండియా స్కీమ్స్‌) పి. సురేంద్ర బాబు, ఆంధ్రప్రదేశ్‌ నెట్‌ బాల్‌ అసోసియేషన్‌ కోశాధికారి ఎం.వీరాంజనేయులు హాజరై విజేతలకు పతకాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డి.నవీన్‌, ఎన్టీఆర్‌ జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కోశాధికారి ఎన్‌.నాగబాబు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అధ్యక్షుడు వల్లే శ్రీనుబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement