న్యూస్‌రీల్
జీతాల కోసం రోడ్డెక్కాల్సి వస్తోంది
కార్మికులు ప్రతినెలా జీతాల కోసం రోడ్డెక్కాల్సిన దయనీయస్థితి నెలకొంటోంది. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి ఉండదు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయినా ఏడు నెలల పాటు బిల్లులు పెండింగ్ పెట్టడం కూడా సరికాదు. ప్రభుత్వం కార్మికుల జీతాలకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలి.
చంద్రబాబు సర్కార్ చెవికెక్కని కార్మికుల గోడు
జీతాలు చెల్లించండి మహాప్రభో అంటున్న కార్మికుల గోడు ప్రభుత్వం చెవికెక్కడం లేదు. ఆస్పత్రి నుంచి కార్మికులు మూకుమ్మడిగా కలెక్టరేట్‌కు వచ్చి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదు. మరోవైపు వైద్య విద్య సంచాలకులతో పాటు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. జీతాల నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యాన్ని వీడలేదు.
దుర్గమ్మ సేవలో..
కూటమి పాలనలో
కార్మికుల ఆకలి కేకలు
జీజీహెచ్‌లో శానిటేషన్, సెక్యూరిటీ
వంటి బిల్లులు ఎనిమిది
నెలలుగా పెండింగ్
జీతాల కోసం రోడ్డెక్కుతున్న
పారిశుద్ధ్య కార్మికులు
చంద్రబాబు సర్కార్ తీరుపై
కార్మిక సంఘ నేతల ఆగ్రహం
– పుప్పాల కృష్ణ, సీఐటీయూ నేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ సీసీఎల్‌ఏ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి శుక్రవారం దర్శించుకున్నారు.
జీజీహెచ్‌లో ప్రతి ఉదయం వార్డులను శుభ్రం చేస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించే చేతులే.. ఇంటికి వెళ్లాక తమ పిల్లలకు ఒక్క పూట భోజనం ఎలా పెట్టాలా అని ఆవేదన చెందుతున్నాయి. నెలలు గడుస్తున్నా జీతాలు అందక అద్దె చెల్లించలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న వందలాది కార్మికుల జీవితం దయనీయంగా మారింది. ఆస్పత్రి సేవలు ఆగకుండా కష్టపడుతున్న వారికి మాత్రం జీతాలు అందడం లేదు. ఎనిమిది నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టు సంస్థలు కూడా చేతులెత్తేయగా, చివరకు తమ కష్టానికి ప్రతిఫలం అడగడానికి కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.


