ముసాయిదా విడుదలైంది ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

ముసాయిదా విడుదలైంది ‘సర్‌’

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

క్లయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరణ

2026 సర్‌ ముసాయిదా జాబితా

కృష్ణా జిల్లాలో 14,05,580

మంది ఓటర్లు

ముసాయిదా జాబితా విడుదల చేసిన

ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ నవీన్‌

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌)కు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం కృష్ణాజిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ విడుదల చేశారు. జాబితా ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించి డిజిటలైజేషన్‌ ప్రక్రియ జరిపిన తరువాత జిల్లా వ్యాప్తంగా 14,05,580 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,79,271 మంది పురుషులు, 7,26,266 మంది మహిళలు, 43 మంది ఇతరులు ఉన్నారు. వీరు కాక 537 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. 2025 జనవరి 6వ తేదీన విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 15,40,356 మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం 2026 మే నెలాఖరు వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియను బట్టి చూస్తే 15,43,242 మంది ఓటర్లు నమోదయ్యారు. సర్‌ ప్రక్రియ అనంతరం 14,05,580 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. 1,37,662 మంది ఓటర్ల ఎన్యుమరేషన్‌ ఫారాలు అన్‌కలక్టబుల్‌గా నమోదు చేసినట్లు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ వివరించారు.

షెడ్యూలు ప్రకారం ముసాయిదా జాబితాను ప్రకటించారు. దీన్ని పరిశీలించిన అనంతరం ఎవరైనా ఓటర్లు క్లయిమ్‌లు, అభ్యంతరాలను ఆగస్టు 30వ తేదీలోగా తెలియజేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలు అన్‌ కలక్టబుల్‌గా నమోదైన వారిలో సర్వే ప్రకారం 56,346 మంది మరణించగా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు 24,603, డూప్లికేట్‌ ఓటర్లుగా 34,650 మంది, అందుబాటులో లేని ఓటర్లు 21,970 మంది, ఇతర కారణాలతో 93 మంది ఉన్నారు. మరణించిన, డూప్లికేట్‌ ఓటర్లు నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, జాబితాలో పేర్లు లేనివారు ఆగస్టు 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్లలో 2002 సర్‌ వివరాలు సమర్పించని వారికి, సమర్పించిన వివరాలు తప్పుగా ఉన్నాయని గుర్తించినా వారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న వారు ఎన్నికల కమిషన్‌ పేర్కొన్న 11 రకాల డాక్యుమెంట్లతో ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు, క్లయిమ్‌లతో పాటు నో మ్యాపింగ్‌కు నోటీసులు ఇచ్చిన వారు వారి వివరాలను సెప్టెంబరు 28వ తేదీలోగా ఎన్నికల అధికారులు పరిశీలించి పరిష్కరించటం జరుగుతుంది. అనంతరం అక్టోబరు 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం 2026 మే జాబితా వ్యత్యాసం

గన్నవరం 1,22,001 1,33,168 9 2,55,178 2,81,945 26,767

గుడివాడ 87,376 95,606 11 1,82,993 2,04,963 21,970

పెడన 78,504 80,163 – 1,58,667 1,67,955 9,288

మచిలీపట్నం 86,075 92,776 9 1,78,860 1,96,889 18,029

అవనిగడ్డ 97,322 1,00,405 8 1,97,735 2,10,873 13,138

పామర్రు 83,555 89,177 3 1,72,735 1,83,444 10,709

పెనమలూరు 1,24,438 1,34,971 3 2,59,412 2,97,173 37,761

మొత్తం 6,79,271 7,26,266 43 14,05,580 15,43,242 1,37,662

‘వరి’ వద్దంటున్న పాలకులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement