మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక మహోత్సవాలు ఆగస్టు నాలుగు నుంచి ఏడో తేదీ వరకు జరుగుతాయని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు గురువారం తెలిపారు. ఆలయలో రోజూ నిర్వహించే శాంతి కల్యాణం, రుద్రాభిషే కాలను నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు నిలిపివేశామని పేర్కొన్నారు. ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వామి వారి కల్యాణం వైభవంగా జరుగుతుందని వివరించారు. స్వామివారి జన్మనక్షత్రం ఆషాఢ కృత్తిక (ఆడికృత్తిక)ను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఏడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వల్లీదేవ సేన అమ్మవార్లకు శాకంబరీ అలంకరణ, ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయని వివరించారు.


