దుర్గమ్మకు బంగారు హారం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు బంగారు హారం సమర్పణ

Jul 15 2026 5:09 AM | Updated on Jul 15 2026 5:09 AM

అనధికార వెంచర్‌ కోసం వంతెన నిర్మాణం మచిలీపట్నంటౌన్‌: నగరంలోని ఈడేపల్లి ప్రధాన డ్రెయిన్‌ గోడలపై ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ యజమాని పక్కా వంతెన నిర్మాణం చేపట్టారు. బైపాస్‌ రోడ్డు నుంచి శక్తి గుడికి వెళ్లే రోడ్డు ప్రారంభంలో కుడి చేతి వైపు అనుమతులు లేని వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్‌ నుంచి రోడ్డుపైకి వచ్చేందుకు ఈడేపల్లి ప్రధాన డ్రెయిన్‌ గోడలపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనులు కొద్ది రోజులుగా జరుగుతున్నా కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రెయిన్‌ పక్కన సామాన్యుడు చిన్న బడ్డీ పెడితేనే తొలగిస్తున్న మునిసిపల్‌ అధికారులు డ్రెయిన్‌పై ఏకంగా పక్కా వంతెన నిర్మిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి వంతెన నిర్మాణం, అనుమతులు లేని వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్‌ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరంవేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ అధికారి డీవివి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.

డాక్టర్‌ జవ్వాజి లోకేష్‌కు గోల్డ్‌మెడల్‌ ప్రదానం

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జనరల్‌ సర్జరీ విభాగంలో ఉత్తమ అవుట్‌గోయింగ్‌ పోస్టు గాడ్యుయేల్‌ విద్యార్థిగా ఎంపికై న డాక్టర్‌ జవ్వాజీ లోకేష్‌కు సోమవారం డాక్టర్‌ కనకమేడల శ్రీనివాస్‌ స్మారక గోల్డ్‌మెడల్‌ను అందజేశారు. వైద్య కళాశాల సెమినార్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ ఎ విష్ణువర్థన్‌, డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్‌ పులాల చంద్రశేఖర్‌ చేతుల మీదగా ఈ మెడల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు మాట్లాడుతూ జనరల్‌ సర్జరీలో ఉత్తమ అవుట్‌గోయింగ్‌ విద్యార్థికి డాక్టర్‌ కనకమేడల శ్రీనివాస్‌ స్మారకార్థం ఆయన పుట్టిన రోజు అయిన జూలై 14న ఏటా ఈ గోల్డ్‌మెడల్‌ అందిస్తున్నట్లు తెలిపారు. జీజీహెడ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌, జనరల్‌ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్‌ పద్మశ్రీ, కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ ప్రతినిధులు, మెడల్‌ గ్రహీత తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వైద్య శాఖలో సమస్యలు పరిష్కరించాలని వినతి

మధురానగర్‌(విజయవాడ సెంట్రల్‌): రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఏర్పడే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని, నిలిచిన సీహెచ్‌వో, ఇతర కేడర్‌ ఉద్యోగోన్నతులు పూర్తిచేయాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొంతి ఆస్కార్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆ శాఖ కార్యదర్శి వీరపాండియన్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల ఇబ్బందులు, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సాగర్‌, నాయకులు సత్యనారాయణ, సత్యనారాయణ బాబు, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement