ఆసిఫాబాద్‌అర్బన్: 80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా కన్వీనర్ ఖాండ్రె విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కోట్నాక విజయ్ హాజరయ్యారు. మొదట అంబేడ్కర్ చౌక్ నుంచి ర్యాలీ ప్రారంభం కాగా విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. గాంధీచౌక్, వివేకానంద చౌక్ మీదుగా మళ్లీ అంబేడ్కర్ చౌక్‌కు చేరుకున్నారు. నాయకులు అరిగెల మల్లికార్జున్, సుచిత్, ఈదులవాడ గణేశ్, సతీశ్‌బాబు, రాజేంద్రప్రసాద్, లచ్చన్న, సత్యనారాయణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.


