ప్రస్తుత జిల్లా కలెక్టర్ కె.హరిత సైతం విధి నిర్వహణలో తనదైన ముద్ర వేస్తున్నారు. పరిపాలనా పరమైన అంశాల్లో చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, ఆశ్రమ వసతి గృహాలను ఆకస్మిక తని ఖీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ శివారులోని ఓ ప్రభుత్వ భూమిలో నిరుపేద ఆదివాసీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదివాసీలు కలెక్టర్‌ను కోరారు. దీనిపై అధికారులు ఇప్పటికే సర్వే చేపట్టారు. ఈ స్థలంలో ఆదివాసీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కలెక్టర్ కె.హరిత పేరుతో కాలనీ ఏర్పాటు చేసుకుంటామని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.


