ఆసిఫాబాద్‌రూరల్: ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి అన్నా రు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘ ర్ తిరంగా, వనమహోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ అట వీ విస్తీర్ణం తగ్గడంతో ప్రస్తుతం వర్షాలు తగ్గుతున్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కు కృషి చేయాలని సూచించారు. అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో బాధ్యతగా పాలుపంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మలత, ఎఫ్‌ఆర్‌వో గోవింద్‌చంద్ సర్దార్, డీఆర్‌వో ఝాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


