‘ఐక్యత’కు బీటలు..! | - | Sakshi
Sakshi News home page

‘ఐక్యత’కు బీటలు..!

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:04 AM

● ఎస్పీఎం కార్మిక జేఏసీలో అంతర్గత విభేదాలు ● రెండుగా చీలిన కార్మిక సంఘాలు ● కొత్త ఫోరం ఏర్పాటు

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే ఏకై క డిమాండ్‌తో నాలుగు నెలలుగా పోరాడుతుండగా జేఏసీలో అంతర్గత కుమ్ములాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏకమైన 15 కార్మిక సంఘాలు రెండుగా చీలిపోయాయి. కొత్త ఫోరం ఏర్పాటుతో కొత్త ప్రతిపాదనలు ముందుకు తేవడం వివాదానికి కారణమవుతుంది. మొత్తం 15 సంఘాలు ఉండగా, కార్మిక శాఖ రికార్డుల్లో ఉన్న ఐదు సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడ్డాయి. గుర్తింపు ఎన్నికలే సమస్యలకు పరిష్కారమని భావిస్తూ 87 రోజులుగా ఎస్పీఎం స్టాఫ్‌ గేటు ఎదుట కార్మికులు రిలే నిరహార దీక్షలు చేపడుతున్నారు. నాయకులంతా కలిసికట్టుగా పోరాటాన్ని ఉధృతం చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులు, హైదరాబాద్‌ నుంచి వచ్చిన నాయకులు కూడా దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఇలాంటి సమయంలో విభేదాలు కార్మిక వర్గంలో కలవరం సృష్టిస్తున్నాయి.

కొత్త ఫోరం వాదనతో వివాదం

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలన్నీ ఏకమై ఎస్పీఎం యాజమాన్యానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో కార్మికుల సమస్యలు పరి ష్కారమైనట్లేనని అంతా భావించారు. ఇప్పుడు ఈ జేఏ సీ నుంచి కొన్ని సంఘాలు విడిపోయి కొత్త ఫోరం ఏర్పాటు చేశాయి. కోర్టు కేసు పెండింగ్‌ ఉండడంతో మెజార్టీ కార్మికులు ఒప్పుకుంటే ముందు అగ్రిమెంట్‌ చేసుకుందామని కొత్త ఫోరం ప్రతిపాదించడం వివాదానికి కారణమైంది. కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదని, అప్పటి వరకు కార్మికులు నష్టపోకుండా వేతన ఒప్పందం చేయించాలని వారు వా దిస్తున్నారు. మరోవైపు ముందు కోర్టులో ఉన్న గు ర్తింపు ఎన్నికల కేసును పరిష్కరించాలని, గెలిచిన సంఘంతో ఒప్పందం కుదుర్చుకోవాలని పాత జేఏసీ వాదిస్తోంది. అగ్రిమెంట్‌ అంటూ యాజమాన్యానికి అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేస్తున్నారు.

నాయకుల మాటల యుద్ధం

ఐటీసీ వేతనాలు ఇప్పిస్తామంటున్న కల్లోల భట్టాచార్యపై పాత జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచినా ఐటీసీ వేతనా లు ఎందుకు ఇప్పించలేదని.. ఇప్పుడు ఏ హోదాలో ఇప్పిస్తారని కార్మికులు, సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలతో కార్మికుల్లో అయోమయం నెలకొంది. నాలుగు నెలలుగా ఐక్యంగా పోరాడుతుండగా, ఈ చీలిక మిల్లు యాజమాన్యానికి అనుకూలంగా మారుతోందని కార్మిక వర్గాల్లో చర్చ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement