సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ డి మాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో జైల్‌భరో కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టారు. మొద ట కలెక్టరేట్ నుంచి బస్టాండ్ ఏరియా చౌరస్తా వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ చౌరస్తా వద్ద బైఠాయించగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. అలాగే కాగజ్‌నగర్ పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాల నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లు అమలైతే 12 గంటల పనివిధానం వచ్చే ప్రమాదం ఉందని, ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పోతుందన్నారు. ముందస్తు నోటీసు లేకుండానే కార్మికులను తొలగించే విధానానికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. కార్మిక వ్యతి రేక లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అలాగే వీబీజీ రాంజీ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, నాయకులు బాలకిషన్, శ్రీకాంత్, కృష్ణమాచా రి, దుర్గం దినకర్, గొడిసెల కార్తీక్, చాంద్ పాషా, ముంజం శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


