ఏరు పారె.. ఆశ చిగురించె! | - | Sakshi
Sakshi News home page

ఏరు పారె.. ఆశ చిగురించె!

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులకు జలకళ అన్ని మండలాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు జోరందుకున్న వరి నాట్లు ఆశాజనకంగా పత్తి, ఇతర పంటలు

దహెగాం: ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ ప్రారంభంలో వానలు లేక అన్నదాతలు అల్లాడిపోయారు. ఏ కుంట చూసినా చుక్కనీరు కనబడలేదు. పత్తి విత్తనాలు విత్తుకున్నా.. చెరువుల కింద ఎక్కడా ఒక్క ఎకరం నాటు పడలేదు. ఈ తరుణంలో వరుణుడు కరుణించాడు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పెద్దవాగు, పెన్‌గంగ, ప్రాణ హిత నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో ఆ యకట్టు రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. పొలాల్లో వీల్స్‌ కొట్టడం, నారు మడులు సిద్ధం చేసి మొలక అలుకుతున్నారు. ఆలస్యమైనా జిల్లా రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా, ఇందులో ప్రధానంగా 3.75 లక్షల ఎకరాల్లో పత్తి, సుమారుగా 48 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పత్తి విత్తుకుని రెండు నెలలు కావొస్తుండగా, ప్రస్తుతం పూత దశకు చేరుతోంది. ఎరువులు వేసి కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. బోర్ల సౌకర్యం ఉన్న రైతులు ఇప్పటికే నాట్లు వేసి 20 రోజులు గడిచింది. ఇంకా వరి నాట్లు కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటల కింద ఇప్పుడిప్పుడే నార్లు అలుకుతుండగా, నాట్లు పూర్తయ్యేందుకు మరో 20 నుంచి 25 రోజులు పట్ట అవకాశం ఉంది.

లోటు నుంచి సాధారణం..

జిల్లావ్యాప్తంగా పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం 15 మండలాల్లో లింగాపూర్‌, తిర్యాణి, కెరమెరి మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దహెగాం, కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో సాధారణం కంటే తక్కువగా కురిసింది. అయినా 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 643.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 702 మి.మీ.లు కురిసింది. భూగర్బ జలాలు సైతం గణనీయంగా పెరిగాయి. అలాగే ప్రధాన ప్రాజెక్టులైన కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్‌ సాగర్‌, పీపీరావు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులు నిండటం రైతులకు ఊరట కలిగించే అంశం.

జూన్‌ 1 నుంచి ఆగస్టు 10 వరకు వర్షపాతం(మి.మీ.లలో)

మండలం సాధారణం కురిసింది వ్యత్యాసం

జైనూర్‌ 689.2 781.7 13.0

సిర్పూర్‌(యు) 672.1 798.2 19.0

లింగాపూర్‌ 648.7 794.6 22.0

తిర్యాణి 557.7 747.8 34.0

రెబ్బెన 550.7 616.3 12.0

ఆసిఫాబాద్‌ 574.2 649.6 13.0

కెరమెరి 576.8 726.0 26.0

వాంకిడి 611.8 646.9 6.0

కాగజ్‌నగర్‌ 585.5 589.2 1.0

సిర్పూర్‌(టి) 659.8 686.7 4.0

కౌటాల 709.8 668.6 –6.0

చింతలమానెపల్లి 701.7 615.8 –12.0

బెజ్జూర్‌ 740.0 756.9 2.0

పెంచికల్‌పేట్‌ 679.5 786.0 16.0

దహెగాం 699.1 673.6 –4.0

ప్రాజెక్టుల్లో నీటినిల్వ(టీఎంసీల్లో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement