48,160 ఓట్లు ఔట్‌..! | - | Sakshi
Sakshi News home page

48,160 ఓట్లు ఔట్‌..!

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

ముగిసిన ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ గడువు నేడు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాత్కాలిక ఓటరు జాబితా అభ్యంతరాల స్వీకరణకు ఏర్పాట్లు అక్టోబర్‌ 12న తుది ఓటరు జాబితా ప్రదర్శన

(89.10శాతం) (89.76శాతం) (89.43శాతం)

(10.90శాతం) (10.24శాతం) (10.57శాతం)

ఆసిఫాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)– 2026 ప్రక్రియ తుదిదశకు చేరింది. ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ గడువు సోమవారంతో ముగిసింది. జిల్లాలో 678 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 4,55,596 మంది ఓటర్లు ఉండగా వందశాతం ఎన్యూమరేషన్‌ ఫారా లు పంపిణీ చేశారు. మొత్తం ఓటర్లలో 48,160(10.57శాతం) మంది మంది వివిధ కారణాలతో ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించకపోవడంతో వారి ఓట్లు జాబితా నుంచి తొలగించనున్నారు. ఇందులో మరణించిన ఓటర్లతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు అత్యధికంగా ఉన్నారు.

2002 ఓటరు జాబితా ఆధారంగా..

బోగస్‌ ఓట్లకు చెక్‌ పెట్టడంతో పాటు ఒకరికి ఒకేచోట ఓటుహక్కు అనే నినాదంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుత ఓటరు జాబితాతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపడుతోంది. జనవరి 31న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పాత జాబితా ప్రకారం ఓటర్ల వివరాలు సేకరించి, మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు నెలరోజుల పాటు బూత్‌ లెవల్‌ అధికారులు గడపగడపకూ సర్వే చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేశారు. జూలై 31తో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ గడువు ముగియగా ఈ నెల 10 వరకు పెంచారు.

ఫొటో, చిరునామాతో తాత్కాలిక ఓటరు జాబితా

డిజిటలైజేషన్‌ పూర్తవడంతో మంగళవారం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు వెబ్‌సైట్‌లో ఓటరు పేరు, వయస్సు, చిరునామా, ఫొటోతో కూడిన తాత్కాలిక కొత్త ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. పేరు లేని 18 ఏళ్లు నిండిన వారు, మిస్‌ అయిన వారు 06, 07, 08 ఫామ్‌ల ద్వారా బీఎల్‌వోలు, ఆన్‌లైన్‌లో ఏడు రోజుల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యంతరాలకు సంబంధించిన ప్రతీ దరఖాస్తును బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తారు. తహసీల్దార్‌ విచారణ చేసి నిర్ణయిస్తారు. అనంతరం అక్టోబర్‌ 12న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.

నేడు ఓటరు జాబితా ప్రదర్శన

జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫా రాల డిజిటలైజేషన్‌ పూర్తయింది. మంగళవారం అన్ని గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో తాత్కాలిక ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. తర్వాత సమ యం ఇస్తారు. అభ్యంతరాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేసి అనుమానాలు నివృత్తి చేస్తాం.

– లోకేశ్వర్‌రావు, ఆర్డీవో, ఆసిఫాబాద్‌

నియోజకవర్గాల వారీగా వివరాలు

అంశం సిర్పూర్‌ ఆసిఫాబాద్‌ మొత్తం

మొత్తం ఓటర్లు 2,28,916 2,26,680 4,55,596

పంపిణీ చేసిన ఎన్యూమరేషన్‌ ఫారాలు 2,28,916 2,26,680 4,55,596

డిజిటలైజ్‌ చేసినవి 2,03,957 2,03,479 4,07,436

ఓటర్లు స్వయంగా సమర్పించినవి 2,067 554 2,621

సేకరణకు వీలుకాని మొత్తం ఫారాలు 24,959 23,201 48,160

మరణించిన వారు 5,943 5,374 11,317

చిరునామా లేనివారు/లభించనివారు 858 1,336 2,194

శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారినవారు 12,485 11,318 23,803

ఇతర కారణాలు 73 315 388

ఇప్పటికే నమోదైన వారు 5,600 4,858 10,458

89.43 శాతం డిజిటలైజేషన్‌

4,55,596 మంది ఓటర్లలో 4,07,436 మంది ఫారాలు సమర్పించడంతో 89.43 శాతం డిజిటలైజేషన్‌ పూర్తయింది. సిర్పూర్‌ డివిజన్‌లో 2,28,916 మందికి ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయగా 2,03,957(89.1శాతం), ఆసిఫాబాద్‌లో 2,26,680 మందికి ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయగా 2,03,479(89.43 శాతం) డిజిటలైజేషన్‌ పూర్తయింది. 48,160(10.57శాతం) మంది వివిధ కారణాలతో ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించలేదు. వీరంతా ఓటరు జాబితా నుంచి తొలగిపోనున్నారు. ఇందులో ఎక్కువగా 23,803 మంది శాశ్వతంగా వలస వెళ్లగా, 11,317 మంది చనిపోయారు. 388 మంది ఇతరులు ఉన్నారు. 10,458 మంది ఇతర ప్రాంతాల్లో ఓటుహక్కు కలిగిఉన్నారు. 2,621 మంది ఓటర్లు స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement