బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

కాగజ్‌నగర్‌టౌన్‌: పెంచికల్‌పేట్‌ మండలం మొట్లగూడ వద్ద సోమవారం విద్యుత్‌షాక్‌తో స్తంభం పైనుంచి పడి మృతి చెందిన నాగపూరి చందు కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మృతదేహాన్ని కాగజ్‌నగర్‌ సామాజిక ఆస్పత్రికి తీసుకురాగా, ఎమ్మెల్యే ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి విద్యు త్‌ శాఖ నుంచి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ఏడీఈ ఇమ్రాన్‌ అహ్మద్‌, రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం– 327 జిల్లా కార్యదర్శి ఎమ్మాజీ సతీష్‌, విద్యుత్‌ ఉద్యోగులు ఉన్నారు. అనంతరం రూరల్‌ సీఐ కుమారస్వామి పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

మూకుమ్మడి రాజీనామా

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్స్‌ ఎంప్లాయీస్‌ ప్రొటక్షన్‌ యూనియన్‌(రిజిస్టర్‌ నం.2381) కార్యవర్గం మూకుమ్మడిగా రాజీనా మా చేసింది. పట్టణంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ప్రకటన చేశారు. ఇక నుంచి సంఘం కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వారిలో యూనియన్‌ అధ్యక్షుడు కొంగ సత్యనారాయణ, కార్యనిర్వహక అధ్యక్షుడు గోలెం వెంకటేశం, ఉపాధ్యక్షులు గొగర్ల శ్యాంరావు, శీలం రాజమొగిలి, కొత్తకొండ రాజేశ్‌, చిలుముల వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులు కొమ్ము చక్రవర్తి వెంకటేశ్‌, అహ్మద్‌ హుస్సేన్‌, చంద్రమోహన్‌రావు, క్రిష్ణ, రాజు, మహముద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement