సీఎం పర్యటనలో స్వల్ప మార్పు! | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనలో స్వల్ప మార్పు!

May 26 2026 3:14 AM | Updated on May 26 2026 6:54 AM

కెరమెరి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంది. జూన్‌ 2న హైదరాబాద్‌లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరుకానుండగా, జూన్‌ 1వ తేదీనే జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కెరమెరి మండలం కొత్తగూడ గ్రామాన్ని సందర్శించారు.

హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. కొలాం గిరిజనుల కోసం నిర్మించిన 25 ఇందిరమ్మ ఇళ్లను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇరుకుల్ల మంగ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా, నాయకులు మునీర్‌ అహ్మద్‌, కుసుంబ్‌రావు, ఆత్రం లక్ష్మణ్‌, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement