కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని దుర్గానగర్ రైల్వే ట్రాక్ సమీపంలో అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి రోడ్ సెక్టార్ ప్రాజెక్ట్ రైల్వే భూ సేకరణ నిపుణుడు దేవరాజు, కాగజ్‌నగర్ తహసీల్దార్ మధూకర్ శుక్రవారం స్థల పరి శీలన చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే లైన్ విస్తరణ, అభివృద్ధిలో భాగంగా లెవల్ క్రాసింగ్ లైన్ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జీలు నిర్మించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దుర్గానగర్, వేంపల్లి గ్రామాల మధ్య కేఎం195/29–31 వద్ద ఎల్‌సీ 79 లెవల్ క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి జాయింట్ సర్వేచేసినట్లు పే ర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈఈ క్రాంతి, సా యికుమార్, దుర్గానగర్, వేంపల్లి గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


