కాగజ్‌నగర్‌టౌన్: జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జయంతుల సందర్భంగా ఈనెల 12న టీఎస్ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని నర్సింగ్‌హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్తదాతలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. మెడికల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సునీత, రావుజీ, టీఎస్‌యూటీఎఫ్ నాయకులు రాజ్‌కమలాకర్‌రెడ్డి, మహిపాల్, ఫణతి, మహేశ్, సునీల్ తదితరులున్నారు.


