కాగజ్‌నగర్‌టౌన్: పంట మార్పిడితో అధిక దిగుబ డులు పొందవచ్చని ఏడీఏ మనోహర్ సూచించా రు. శుక్రవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మండలంలోని రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరై మా ట్లాడారు. రైతులు పంట మార్పిడి చేయాలని, ఏటా పత్తి, వరి సాగు చేస్తే భూసారం తగ్గి దిగుబడిపై ప్ర భావం పడుతుందని పేర్కొన్నారు. భూమిలో ఉండే పోషక లవణాలు కూడా తగ్గిపోతాయని తెలిపా రు. అధికంగా యూరియా, డీఏపీ వాడడంతో భూ సారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామకృష్ణ, ఏఈవోలు దుర్గాభవాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


