రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో విధులు నిర్వహిస్తున్న ఈపీ ఫిట్టర్ల కు కౌన్సెలింగ్ నిర్వహించాలని హెచ్‌ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజా బాబు కోరారు. శుక్రవారం ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరన్నను కలిసి హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో వి నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ఖైరిగూర ఓసీపీలో పని చేస్తున్న ఈపీ ఫిట్టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి వీటీసీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిని కౌన్సెలింగ్‌లో వెళ్లే వారి స్థానంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స కాలంలో కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో కార్మికులు అన్ని విధాలా నష్టపోతున్నారని తె లిపారు. ఓసీపీ ఇన్‌చార్జి వెంకటేశ్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి కుమార్‌గౌడ్, ఏరియా ఆర్గనైజర్లు ఎస్‌కే ఇనూస్, కళ్యాణ్, రాజశేఖర్‌చారి, ఎండీ జానీ, శ్రీనివాస్ తదితరులున్నారు.


