పెంచికల్‌పేట్: వేసవిలో ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో అడవుల్లోని వన్యప్రాణుల దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టా రు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను గుర్తించి నీటి కుంటలు, సోలార్ కుంటలు, చెక్‌డ్యాంలు, సాసర్ పిట్‌లు నిర్మించారు. సాసర్ పిట్‌లలో ప్రతీ వారం ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. నీటి ఆవాసాల వైపు వస్తు న్న వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా ప్ర త్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంరక్షణకు చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.
రెండు ఫారెస్ట్ డివిజన్లలో..
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లున్నాయి. ఆయా డివిజన్లలో 11 రేంజ్‌లు, 79 సెక్ష న్లు, 245 బీట్‌లు, 846 కంపార్టుమెంట్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, మెకాలు, దుప్పులు, నీలుగాయిలు, కొండ గొర్రెలు, అడవి పందులతో పాటు అనేక రకాల జంతువులు ఆవాసంగా మార్చుకుని జీవనం సాగిస్తున్నా యి. నిత్యం నీటితో కళకళలాడే అటవీ ప్రాంతంలో ని సహజ నీటి వనరులు ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణులు నీటి కోసం అడవులను దాటి వేటగాళ్లకు చిక్కి మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులకు నీటి కొర త లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో నే అవి సంచరించే ప్రాంతాలను గుర్తించి సోలార్ నీటి కుంటలు నిర్మించారు. పగలంతా సోలార్ పంపు సెట్ల ద్వారా కుంటల్లో నీటిని నింపుతున్నారు. మరో వైపు కుంటలు లేని చోట సాసర్ పిట్‌లు నిర్మించి ట్యాంకర్ల ద్వారా వారానికోసారి నీటితో నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. నీటి వనరుల వద్ద రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో సెక్షన్, బీట్ అధికారులు ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణకు నిఘా ఏర్పాటు చేశారు. అవి వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారు.
పోతెపల్లి అటవీ ప్రాంతంలో నిర్మించిన సోలార్ నీటి కుంట
సంరక్షణకు పకడ్బందీ చర్యలు
వేసవిలో అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు సాసర్‌పిట్‌లలో నీటిని నింపుతున్నాం. అడవుల్లో ఉన్న సహజ నీటి వనరులు ఎండిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు నీటి కోసం అడవిని దాటి బ యటకి రాకుండా నీటి వసతి కల్పిస్తున్నాం. వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్వో, పెంచికల్‌పేట్


