మెనూ ప్రకారం భోజనం అందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
రెబ్బెన(ఆసిఫాబాద్): ఆశ్రమ పాఠశాలల వి ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గు ప్తా అన్నారు. మండలంలోని గోలేటి విలేజ్‌లో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్య, వైద్యం, భో జనాల వివరాలను అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడు తూ మెరుగైన విద్య అందించాలని ఆదేశించా రు. సబ్జెక్టుల వారీగా అర్థమయ్యే రీతిలో బో ధించాలన్నారు. దోమలతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పా టించాలని ఆదేశించారు. ప్రతిరోజూ వంటగ ది, స్టోర్‌రూం, తాగునీరు, మరుగుదొడ్లను శు భ్రంగా ఉంచాలన్నారు. అనంతరం తరగతి గ దిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్ర శ్నలు అడిగి వారి సామర్థ్యాలు పరీక్షించారు. ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని సూచించారు. ఆర్వో ప్లాంటు పనిచేయకపోవడంతో పిల్లలు బోర్‌వెల్ నీటిని తాగడంపై ఆరా తీశారు. మెనూ సక్రమంగా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శానిటేషన్ సక్రమంగా లేకపోవడంతో హెచ్‌ఎం రవీందర్, వార్డెన్ మోహన్‌దాస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


