అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని | - | Sakshi
Sakshi News home page

అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని

Apr 8 2025 7:15 AM | Updated on Apr 8 2025 7:15 AM

అర్జీ

అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అర్జీలు సమర్పించి.. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సదరం సర్టిఫికెట్‌ జారీ చేయాలని రెబ్బెన మండలం కైరిగాం గ్రామానికి చెందిన పర్వతి మహేశ్‌ విన్నవించాడు. సదరం సర్టిఫికెట్‌ ఉన్న తనకు దివ్యాంగుల ఫించన్‌ మంజూరు చేయాలని రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని రమణారెడ్డి నగర్‌కు చెందిన నక్క నిఖిల్‌ కోరారు. రెబ్బెన మండలం తుంగెడ– 3 అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్నానని, అనారోగ్య కారణాలతో తనను బదిలీ చేయాలని కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఆత్రం శకుంతల దరఖాస్తు చేసుకుంది. కాగజ్‌నగర్‌ మండలం బోరిగాం గ్రామ శివారులో ఉన్న రెండు ప్లాట్లు కబ్జాకు గురయ్యాయని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన మహిన్‌ అంజూమ్‌ వేడుకున్నారు. ఉపాధిహామీ పథకంలో ఉద్యోగావకాశం కల్పించాలని ఆసిఫాబాద్‌ మండలం చోర్‌పల్లి గ్రామానికి చెందిన నగరారి బాబురావ్‌ కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

చదువుకునే అవకాశం కల్పించండి

నేను మాటలు రాని ది వ్యాంగుడిని. ప్రభుత్వం త రుఫున చదువుకునే అవకా శం కల్పించాలి. సరైన వైద్యం అందించేందుకు చొ రవ చూపాలి. సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేసి, పింఛన్‌ మంజూరు చేసే ఉపయోగకరంగా ఉంటుంది. – సుల్తాన్‌, ఎల్లాపటార్‌, మం.లింగాపూర్‌

పింఛన్‌ రాక ఇబ్బందులు

నేను మానసిక దివ్యాంగుడిని. సదరం ధ్రువపత్రం కూడా ఉంది. అయినా పింఛన్‌ రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి పింఛన్‌ అందించి ఆదుకోవాలి.

– షేక్‌ సుల్తాన్‌, ఎల్లాపటార్‌, మం.లింగాపూర్‌

అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని1
1/2

అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని

అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని2
2/2

అర్జీలు అందించి.. ఆవేదన చెప్పుకుని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement