ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌లో ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. వైరా మార్గం నుంచి వాహనాలు ఓ పక్క బైపాస్‌కు, మరో పక్క నగరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాక ఖమ్మం నుంచి, బైపాస్ నుంచి వాహనాలు వచ్చే క్రమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈమేరకు సిగ్నళ్ల ఆవశ్యకతను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా గతంలోనే ఏర్పాటుచేసిన సిగ్నళ్లను మనుగడలోకి తీసుకొచ్చారు. అయితే, ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందిని కూడా నియమించాలనే వినతులు వస్తున్నాయి.
బాధ్యతతో
విధులు నిర్వర్తించాలి
మణుగూరు టౌన్: పోలీసు ఉద్యోగులు బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రత పరిరక్షణలో కీలకంగా నిలవాలని ఆరో బెటాలియన్ డీఐజీ మురళీకృష్ణ సూచించారు. బుధవారం మణుగూరు వచ్చిన ఆయనకు డీఎస్పీ రవీంద్రరెడ్డి, సీఐ నాగబాబు స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన డీఐజీ.. పాత పోలీస్‌స్టేషన్‌లోని బెటాలియన్ సిబ్బందికి వసతి, సౌకర్యాలపై ఆరా తీసి సూచనలు చేశారు. బెటాలియన్ ఎస్పీ, డీఎస్పీలు పాల్గొన్నారు.
6వ బెటాలియన్ డీఐజీ మురళీకృష్ణ


