ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని ఖరారు చేయడంపై డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారా యణ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యావంతుల ప్రతినిధిగా, నిబద్ధతతో పనిచేసిన ఆయనకు టికెట్ కేటాయించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, పీసీసీచీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీఎం, డిప్యూటీ సీఎంలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సర్వోత్తంరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా జిల్లా పార్టీశ్రేణులు శ్రమించాలని, ఇందుకోసం అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలని ఓ ప్రకటనలో సూచించారు.
లెక్చరర్ల అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడిగా గామయ్య
కారేపల్లి: తెలంగాణ ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా యనమాల గామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కారేపల్లి మండలం గాంధీనగర్ గురుకులంలో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను బుధవారం ఎన్నుకున్నారు. ఈసందర్భంగా గామయ్యను ప్రిన్సి పాల్ హరికృష్ణ, అధ్యాపకులు అభినందించగా, ఆయన మాట్లాడుతూ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ముగిసిన
మత్స్యకారుల శిక్షణ
కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో దేశవాళీ కార్ప్ చేప పిల్లల విత్తనోత్పత్తి, యాజమాన్య పద్ధతులపై మూడు రోజులు గా ఇస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది. ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హైదరా బాద్ జిల్లాలకు చెందిన పలువురు మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొనగా వారికి సర్టిఫి కెట్లు అందజేశారు. ఈసందర్భంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం నిర్వాహకులు శ్రీనివాస్, పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ పలు అంశాలపై అవాహన కల్పించారు. శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కేసు పెండింగ్ ఉన్నా పాస్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్
ఖమ్మం లీగల్: న్యాయస్థానంలో క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉందనే కారణంతో పాస్‌పోర్ట్ జారీకి నిరాకరించిన హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి నిర్ణయంపై ఖమ్మం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఏపూరి బిందుప్రియ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు పెండింగ్‌లో ఉందని ఓ వ్యక్తికి పాస్‌పోర్ట్ జారీని నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు బుధవారం విన్న న్యాయమూర్తి... క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన పాస్‌పోర్ట్ జారీకి పూర్తిగా నిరాకరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పాస్‌పోర్ట్ జారీ చేయొచ్చని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యాన కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కల్యాణం...
కమనీయం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం వైభవంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవామండపంలో స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు.. నిత్య కల్యాణమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు.


