పల్లెలో ఇక ‘ఉపాధి’ జోరు! | - | Sakshi
Sakshi News home page

పల్లెలో ఇక ‘ఉపాధి’ జోరు!

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

● ఏడాదికి సరిపడా పనుల గుర్తింపు ● రేపు గ్రామసభల్లో తీర్మానాలు

● ఏడాదికి సరిపడా పనుల గుర్తింపు ● రేపు గ్రామసభల్లో తీర్మానాలు

నేలకొండపల్లి: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈనేపథ్యాన వ్యవసాయ కూలీలు ఇబ్బంది పడకుండా వీబీజీ రాంజీ పథకం ద్వారా విరివిరిగా పనులు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లో గుర్తించిన పనులపై శుక్రవారం అన్ని పంచాయతీలలో తీర్మానాలు చేయనున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో చాలావరకు కంది, పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. అరకొరగా వచ్చిన మొలకలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈనేపథ్యాన చిన్న, సన్నకారులు రైతులు కూడా పథకాన్ని వినియోగించుకునే అవకాశముందని భావిస్తున్నారు.

తీర్మానం తప్పనిసరి

పంచాయతీల్లో చేపట్టే ప్రతీ పనికి కూడ తీర్మానాన్ని తప్పనిసరి చేశారు. ఈమేరకు 2న తేదీన శుక్రవారం పంచాయతీలో జరిగే గ్రామ సభలలో ఎంపిక చేసిన పనులపై తీర్మానాలు చేయనున్నారు. కనీసం రూ.50 లక్షలకు పైగా అవసరమైన పనులు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇంటింటికి ఇంకు డు గుంత, పొలానికో పంటకుంట, సేద్యపు పంటలు, ఊరికో ఊట కుంట వంటి పనులే కాక మొక్కల పెంపకం, చెరువుల్లో పూడిక తీత, చెరువులు, కాల్వలు, పునరుద్ధరణ, బోర్ల రీచార్జీ వంటి పనులు ఖరారు చేశారు. పంచాయతీల వారీగా తీర్మానాలు చేశాక ఈనెల రెండో వారం నుంచి పనులు చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రతీ జాబ్‌కార్డుకు 50 రోజుల పని దినాలు, ఏప్రిల్‌ నుంచి 75 రోజుల పని దినాలు కల్పించాలని, కూలీలకు రోజుకు రూ.308 చొప్పున చెల్లించనున్నట్లు చెబుతున్నారు.

సర్పంచ్‌లు, కార్యదర్శులకు అవగాహన

ఎల్‌నినోను ఎదుర్కొనేలా ప్రతీ ఒక్కరికి పని కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు పనుల గుర్తింపు, తీర్మానాలపై రైతు వేదికల్లో సర్పంచ్‌లలు, కార్యదర్శులకు బుధవారం అవగాహన కల్పించారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి పనుల గుర్తింపు, కూలీలకు ఉపాధి, గ్రామసభల్లో తీర్మానాలపై సూచనలుచేశారు. ఈ వీసీకి నేలకొండపల్లి నుంచి హాజరైన ఎంపీడీఓ ఎం.యర్రయ్య అనంతరం పథకం లక్ష్యాలను సర్పంచ్‌లు, కార్యదర్శులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement