చింతకాని: భద్రాచలంలో శ్రీరామనవమికి జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలు సమర్పించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు చింతకాని వందనంలోని వేములపల్లి సీతారాంబాబుకు చెందిన పొలంలో బుధవారం వరి నాట్లు వేశారు. తొలుత రామయ్యకు పూజలు చేసిన భక్తులు, రామనామ సంకీర్తనలతో నాట్లు వేశారు. ఐదేళ్లుగా కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలు సమర్పిస్తున్నామని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి రామిరెడ్డి, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, ఉష తదితరులు పాల్గొన్నారు.


