ఆధునికత దిశగా.. | - | Sakshi
Sakshi News home page

ఆధునికత దిశగా..

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

ఆకట్టుకునే కొమ్ము నృత్యం

సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఆదివాసీలు

ఉన్నత విద్యతో కొలువులు

సాధిస్తున్న అడవిబిడ్డలు

వలస ఆదివాసీల్లో

ఇప్పుడిప్పుడే ముందడుగు

పాల్వంచరూరల్‌: ప్రకృతితో మమేకమై అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించిన ఆదివాసీలు క్రమంగా ఆధునికత వైపు అడుగులు చేస్తున్నారు. ప్రభుత్వ సదుపాయాలు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ చైతన్యం, ముందడుగు ఆదివాసీ సమాజం మొత్తంలో లేదు. పాలకులు, ఉన్నతాధికారులు, అభ్యుదయ, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే ఆదివాసీలు అందరూ ప్రగతిబాట పట్టే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. తొలుత అడవే వీరి జీవనానికి ప్రధాన ఆధారంగా ఉండేది. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా ఉపాధి పొందేవారు. క్రమంగా వ్యవసాయం చేయడంతోపాటు వివిధ రకాల వృత్తి, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి కొలువులు కూడా చేపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వస్త్రధారణపైనా ఆసక్తి చూపుతున్నారు. పలువురుఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో, ఎంబీబీఎస్‌, డిగ్రీ, పీజీలు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. ఐటీడీఏ పరిధిలో 32 గురుకుల, ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 14,253 గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60 శాతం మంది ఆదివాసీలే ఉన్నారు.

భద్రాచలం: ఆదివాసీ సంప్రదాయ కొమ్మునృత్యం నేడు యువతకు ఉపాధిగా మారింది. కొమ్ము పాగా ధరించి డోలు వాయిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ఆకట్టుకుంటుంది. ఇద్దరు నృత్యకారులు ఎగురుతూ ధరించిన కొమ్ములతో ఢీ కొట్టే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. దీన్నే రేలా నృత్యం అని కూడా పిలుస్తారు. పురుషులు అడవి దున్న లేదా ఎద్దు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేకమైన కిరీటాన్ని తలకు ధరిస్తారు. శరీరంపై నెమలి ఈకలు, వర్ణరంజితమైన దుస్తులు, చేతిలో డప్పు (తుడుము) కనిపిస్తాయి. తొలుత ఆదివాసీ గ్రామాల్లోనే ప్రదర్శించే ఈ నృత్యం ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో, ప్రముఖుల పర్యటనల్లో ప్రదర్శిస్తున్నారు. దీంతో కొందరు ఆదివాసీ యువకులు సంస్కృతిని కాపాడుకుంటూనే కొమ్ము నృత్యంతో ఉపాధి పొందుతున్నారు. గొత్తికోయ గిరిజన గ్రామాల్లో మూల ఆదివాసీ సంక్షేమ సంఘం (మాస్‌ ), గిరిజన పెద్దలు కలిసి ఆదివాసీ పల్లెల్లో డీజేలను వినియోగించొద్దని నిర్ణయించుకున్నారు. సంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిస్తున్నారు.

నేడు ప్రపంచ

ఆదివాసీ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement