ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదా నికి అర్చకులు పంచామృతం అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామితో పాటు అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, ఆతర్వాత పల్ల కీ సేవ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఏఓయూలో డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు
సత్తుపల్లి టౌన్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ ప్రవేశాల గడువు ను సెప్టెంబర్ 9వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ చీపు పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇంటర్, పాలి టెక్నిక్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్, డిప్లొమా పాసై న విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ఎస్‌టీ కోయ, చెంచు, గోండు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత విద్య అందుతుందని తెలి పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ రెగ్యులర్ డిగ్రీ చేయలేని వారు, గృహిణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, రెండు, మూడో సంవత్సరం విద్యార్థులు సెప్టెంబర్ 9 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. వివరాలకు 94918 81910, 81878 37058 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
పక్కా ప్రణాళికతో
డెంగీ నియంత్రణ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డెంగీ వ్యాధి నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కేఎంసీలో శనివారం ఆయన అర్బన్ మలేరియా విభాగం సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంఓ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగిస్తోందన్నారు. 2022లో 272, 2023వ సంవత్సరంలో 129, 2024లో 65, 2025లో 45 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు మూడే నమోదయ్యాయని తెలిపారు. అయినా గత అనుభవాల దృష్ట్యా వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో యాంటీ లార్వా కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. సైడ్ డ్రెయిన్లలో నీరు నిల్వ ఉండకుండా చూస్తూ, ఫాగింగ్ నిర్వహించాలని తెలిపారు.
మత్స్య రైతులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: మండలంలోని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో హైదరాబాద్‌కు చెందిన పీ.వీ.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన మత్స్య రైతులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ‘బయోప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై ఇక్కడ మూడు రోజుల పాటు ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, హైదరా బాద్, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న మెళకువలు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అలాగే, నాబార్డ్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.శ్యాంప్రసాద్, శాస్త్రవేత్త బి.రవీందర్‌తో పాటు నాగరాజు తదితరలు మాట్లాడగా శాస్త్రవేత్తలు బానోతు దివ్య, డాక్టర్ కె.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


