ఖమ్మంసహకారనగర్: నీట్ రాష్ట్రస్థాయి ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో సత్తా చాటారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్‌జీకే ప్రసాద్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో కె.ఆరోన్ నిహాల్ రాజ్ 59వ ర్యాంకు, కె.శ్రీహర్ష 91, టి.గౌమతి 104, జి.హర్ష 133, బి.శశాంక్ 236, ఎం.రోహిణి 241, జి.స్పందన 279, జి.విశ్వవర్షిణి 296, జె.వివేక్‌నాయక్ 302, బి.సిద్ధి 303, కె.గుణశేఖర్ 408, వి.శ్రావణి 484 ర్యాంకులు సాధించారని చెప్పారు. వేయిలోపు ర్యాంకులు సాధించిన 30 మంది విద్యార్థులను చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు కార్తీక్, గోపిచంద్, డీన్ శ్రీధర్ అభినందించారు.


